jQuery(document).ready(function($){$('#aside #lang_sel_list ul').addClass('fancy');});

Your browser (Internet Explorer 7 or lower) is out of date. It has known security flaws and may not display all features of this and other websites. Learn how to update your browser.

X

Navigate / search

మాణిక్యాలు

”అరుణగిరి యోగి సకల విజేత” …. ‘అరుణాచల మాహాత్మ్యము’ నుంచి వాక్యం

విధిని జయించేదెలా?

సంపన్నురాలైన స్త్రీ రమణమహర్షుల వారితో చెప్పుకుంది, ‘మనిషి కోరుకునేవన్నీ నాకు లభించాయి’. ఆమె కంఠం రుద్ధమైంది. తమాయించుకుంటూ మెల్లగా కొనసాగించింది, ‘నే కోరినవన్నీ, ఏ మానవుడైనా సరే కోరేవన్నీ నాకు లభించాయి …కానీ, కానీ … మనశ్శాంతి లేదు. ఏదో దానికి అడ్డుపడుతోంది. బహుశః నా ప్రారబ్ధమేమో’ కొంతసేపు నిశ్శబ్దం. మహర్షి తన సహజధోరణిలో పలికారు: ‘సరే, చెప్పదలచినది చెప్పారు. అయితే, విధి ఎవరు? విధి అనేదే లేదు. శరణాగతి చెందితే, అంతా సర్దుకుంటుంది. దేవునిపైనే భారమంతా మోపు నీమీద పెట్టుకోకు. అప్పుడిక విధి ఏం చేస్తుంది?

సా: శరణాగతి అసాధ్యం.

భ: అవును. సంపూర్ణ శరణాగతి దుస్సాధ్యమే. కానీ పాక్షికంగా చెయ్యడం అందరికీ సాధ్యమే. అది క్రమేపి పూర్ణ ప్రపత్తికి దారితీస్తుంది. మరి శరణాగతి సాధ్యం కాకపోతే ఏం చెయ్యాలి? మనశ్శాంతి లేదు. అది నీవల్ల కావట్లేదు. మరెలా, శరణాగతితోనే అది సాధ్యం.

సా: పాక్షిక శరణాగతియా …. కానీ అది విధిని మార్చగలదా?

భ: ఓ.. దివ్యంగా.

సా: విధి పూర్వకర్మ ఫలమేనా?

భ: దేవునికి శరణు చెందితే, అంతా ఆయనే చూసుకుంటారు.

సా: కర్మ దేవుని రచనయే అయితే, ఆయన దానినెలా మారుస్తారు?

Sri Bhagavan descending the Hill
Sri Bhagavan descending the Hill

భ: అన్నీ ఉన్నవి ఆయనలోనే.

దుఃఖము – చెడు

భక్తి

శివదర్శనం కోసం ప్రాకులాడే భక్తురాలితో: ”ఆయనకు శరణుచెంది, ఆయన ఇష్టానికి తలవంచు. కనబడనీ, మాయమవనీ ఆయనిష్టం. నీ యిష్టమొచ్చినట్లు ఆయన నడుచుకోవాలనుకొనడం శరణాగతి కాదు, అది దేవుణ్ణి శాసించడం. ఓపక్క శరణాగతురాలను అంటూనే, ఆయన నువ్వు చెప్పినట్లు నడచుకోవాలని అనుకోవడం శరణాగతి అవుతుందా? నీకు ఎప్పుడు, ఏమి, ఎలా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు. ఆ బాధ్యత ఆయనది. నీకింక బాధ్యతలేం వుండవు. అన్ని బాధ్యతలూ ఆయనవే. అదీ శరణాగతి, అదండీ భక్తి!”

దేవుని అనుగ్రహం

ప్రతివారి హృదయంలో ఆత్మగా నెలకొని ఉండడం భగవంతుని కరుణకు తార్కాణం. ఆ దయాశక్తికి అందరూ పాత్రులే – మంచి-చెడు అనే భేదం లేకుండా. కాబట్టి సాధకులైనవారు కష్టనష్టాలు భగవత్‌ ప్రసాదాలే అనీ, మనసుని క్రమపరిచేందుకేననీ భావించి ప్రసన్నతతో ఉండాలి.

ఆరాధన

తాను దేహమనుకునే వ్యక్తి భగవంతుణ్ణి రూపంలేని వానిగా ఆరాధించలేడు. అతడే విధంగా చేయబోయినా అది సరూప ఆరాధనయే అవుతుంది.

జయాపజయాలు

పనిలో విజయం లభించినపుడు ‘అంతా నా నిర్వాకమే’ అని పొంగిపోకు; ‘దేవుని దయ’ అని కృతజ్ఞతతో ఉండు. అలాగే, పని సఫలం కానప్పుడు అది పనితీరు అనుకోక, కార్యాల జయాపజయాలు మానవ ప్రయత్నంతోకాక దైవానుగ్రహంతో లభిస్తాయని గ్రహించు .

జయాపజయాలు విధివిలాసం. అంతేగాని, సంకల్పశక్తియో, అది లేకపోవడమో కాదు. అన్ని వేళలా సమతాబుద్ధిని సాధించడమే సంకల్పసిద్ధి, దాని విజయం కూడా. సాధకుడు తోటివారి ఆదరణ, సానుభూతులకు పాత్రుడవుతూ ప్రపంచంలో వుండాలి; ఇతరుల అసూయాద్వేషాలకు కాదు.

Sri Bhagavan at Skandashram
Sri Bhagavan at Skandashram

ఆనందజీవన రహస్యం

ఇతరులలో దోషాలను ఎంచకపోవడం, సుగుణాలను మాత్రమే ఎంచడం, మనసును సదా సుప్రసన్నంగా ఉంచడం – చేస్తే, మనిషి జీవితం ఆనందమయం!

Sri Bhagavan sitting in Old Hall
Sri Bhagavan sitting in Old Hall

శత్రువుల పట్ల దృక్పథం

శత్రువు ద్వేషించేది నీవు నిర్మూలించగోరే అహంకారాన్ని; అంచేత వాస్తవంగా నీకతడు సహాయకారి.

స్వప్నంలో అనుగ్రహం

నిడివి (సమయం, సేపు) వంటి ఏవో ఉజ్జాయింపు లెక్కలతో జాగ్రత్‌, స్వప్నం (కల) అంటూ పేర్లుపెట్టారు. సత్యాన్ని దర్శిస్తే ఇవన్నీ అబద్ధమే. కలలో ఒకనికేదో అనుగ్రహం అనుభవమై దాని ఫలితం జీవితమంతా కొనసాగినా, దాన్ని కల అంటామేగానీ, నిజం అనం. ఇక వేకువదశలో ఏదో చిన్న సంఘటన, ఇట్టే గడచిపోతుంది, ఇట్టే మరచిపోతాం; దాన్ని పట్టుకొని నిజం అంటాం. ఏది కల? ఏది నిజం?

కొండపైన రెండవ మరణానుభవం

పండితులెంత విభేదించినా హృదయకేంద్రం కుడివైపునే అంటూవచ్చాను. నేను మాట్లాడేది అనుభవం నుంచి. ఇంటివద్ద సమాధి దశల్లో కూడా నాకది తెలుసు. ‘ఆత్మసాక్షాత్కారం’ గ్రంథంలో వర్ణించినట్లుగా నాకు స్పష్టమైన దర్శనం, అనుభవం కలిగింది. హఠాత్తుగా ఓపక్క నుంచి మెరుపువంటి కాంతి వచ్చి ప్రపంచ దృశ్యాన్ని తుడిచేసింది. ఎడమపక్క చప్పుడుచేసే గుండె ఆగిపోయి, శరీరం జడమై, నీలంగా అయిపోయింది. వాసుదేవశాస్త్రి నేను చనిపోయాననుకొని నా దేహాన్ని కౌగిలించుకొని రోదించసాగాడు. అంతసేపూ, నా కుడిపక్క హృదయ కేంద్రం పనిచేస్తున్నట్లు నాకు స్పష్టంగా తెలుస్తోంది. 15,20 నిమిషాల సేపు ఈ స్థితి కొనసాగింది. అంతలో ఒక్కసారి కుడిపక్కనుంచి ఎడమకి ఓ రాకెట్‌ ఆకాశంలోకి దూసుకొచ్చినట్లుగా ఏదో ఎగసింది. అంతే, రక్తప్రసరణ తిరిగి మొదలైంది. సాధారణ శరీరస్థితి నెలకొంది.

Optimization WordPress Plugins & Solutions by W3 EDGE